కామారెడ్డి పురపాలక సంఘంసమయపాలన పాటించని
–మున్సిపల్ శాఖ అకౌంటెంట్ రాములు
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మార్చి 7:
కామారెడ్డి పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ శాఖ అకౌంటెంట్ రాములు సమయపాలన పాటించడం లేదు. మున్సిపల్ కార్యాలయానికి ప్రతిరోజు 12 గంటలు దాటిన తర్వాత ప్రతిరోజు వస్తున్నాడని వచ్చి మళ్లీ ఏదో టైంలో వెళ్ళిపోతున్నాడని ఆరోపణలు మీడియా దృష్టికి రావడంతో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని మీడియా వివరణ కోరగా మీడియాతో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి మాట్లాడారు. అకౌంటెంట్ రాములు ఎప్పుడొస్తే ఏముందండి అతను లేకపోతే అకౌంటెంట్ రాములు పనులు ఆగడం లేదుకదా అని సమాధానం చెబుతున్నారు. మున్సిపల్ కార్యాలయానికి ఎన్ని గంటలకు రావాలని అడిగితే అకౌంటెంట్ సెక్షన్ అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి, కాబట్టి తన పని తను చేసుకుంటున్నాడని, అతను ఎప్పుడు వస్తే ఏంటి మీకు వారితో ఏమన్నా పని ఉందా అని చెప్పడం చాలా విడ్డూరకరంగా ఉంది. సమయపాలన పాటించని మున్సిపల్ అకౌంటెంట్ రాములు పైన జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ చర్యలు తీసుకొని సమయపాలన పాటించాలని ప్రజలు కోరుతున్నారు.