బాధిత కుటుంబాన్ని పరామర్శించిన-కత్తి కార్తిక గౌడ్
దుబ్బాక:జనవరి11,(తెలంగాణ కెరటం)
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ని 13వ వార్డు డబల్ బెడ్ రూమ్ పరిధిలో నివాసం ఉంటున్న దొమ్మట బాలరాజు (48) ఇటీవలే గుండెపోటుతో మరణించడం జరిగింది.ఈ సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ వారి కుటుంబ సభ్యులను శనివారం రోజున పరామర్శించి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. దొమ్మాట బాలరాజు అకాల మరణం పొందడం చాలా బాధాకరం అన్నారు.ఆమె వెంట సీనియర్ నాయకులు ఆస స్వామి, కొత్త దేవి రెడ్డి,కామోజీ అనురాధ, కే. రాజు తదితరులు పాల్గొన్నారు.