గూడెం గ్రామంలో కాటిరేగుల ఎడ్ల జాతర

గూడెం గ్రామంలో కాటిరేగుల ఎడ్ల జాతర

పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న రైతులు 

తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి జనవరి

మండలంలోని గూడెం గ్రామంలో సంక్రాతి పండుగను పురస్కరించుకొని జరుపుకునే రైతుల పండుగను ఘనంగా నిర్వహించారు. భోగి పండుగ సోమవారం రోజున గ్రామంలోని వ్యవసాయ భూముల వద్ద గ్రామ రైతులు అందరూ కలిసి “కాటిరేగుల ఎడ్ల జాతర” ను జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు తమ ఎడ్లకు, ఆవులకు, గేదెలకు స్నానము చేయించి, గేదెల కొమ్ములకు రంగులు వేసుకొని, ఒక మైదాన ప్రాంతంలో రెండు కట్టలు పాతి, మామిడి తోరణాలు కట్టి నాలుగు గుంజల తోటి ఒక చిన్న పందిరి వేసి, ఆ పందిరి కింద నాలుగు ఎడ్ల ప్రతిమలను పెట్టి వాటితోపాటు ఒకప్పటి కాలాన ఎడ్ల మందను కాసిన పెద్దిరాజు, కాటంరాజు, పోలురాజు ముగ్గురి విగ్రహాలను పచ్చని పందిరి కింద పెట్టుకొని, బోనం చేసి, కోడి, కల్లు, పచ్చని పందిరి విగ్రహాల ముందు పెట్టి భక్తిశ్రద్ధలతో రైతులందరూ మొక్కుకొని, రైతులందరు ఎడ్ల మంద చుట్టూ తిరుగుతూ భక్తిశ్రద్ధలతో గ్రామంలోని వ్యవసాయం, పశువులు, కుటుంబ సభ్యులు, గ్రామమంతా బాగుండాలని జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బామండ్ల రవీందర్ మాట్లాడుతూ, పురాతన సాంప్రదాయాన్ని ఇప్పటికి కొనసాగించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులుబోరుగాని బాబురావు, రోడ్ల రాజిరెడ్డి, యాలాల సదయ్య, దొంత బాలమల్లు, చౌదరి మల్లేశం, పైడి కనకయ్య, పైడి రవి, గూడెల్లి మల్లయ్య, గూడెల్లి రాజు, మహంకాళి రవి రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment