---Advertisement---

ముఖ్యమంత్రి  హామీని నిలబెట్టుకోండి

---Advertisement---

ముఖ్యమంత్రి  హామీని నిలబెట్టుకోండి

జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల జిల్లా అధ్యక్షుడు నీలం లింగం డిమాండ్

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 22:

సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం 13వ రోజు నిరవధిక సమ్మె కార్యక్రమంలో ఉద్యోగులు ఆదివారం ఉద్యోగులు పిల్లల ఆటపాటలతో నిరసన వ్యక్తం చేశారు. నిరవధిక సమ్మెకు మద్దతుగా జిల్లాలోని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు నీలం లింగం మాట్లాడుతు సీఎం వందరోజుల గ్యారెంటీ ఏమైందని ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సేవలు పాఠశాల స్థాయిలో, కాంప్లెక్స్ స్థాయిలో, ఎం ఆర్ సి, కేజీబీవీ, డిపిఓ స్థాయిలో పనిచేసే వారి సేవలు మరువలేని అని విద్య శాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులు లేకుంటే ఆ లోటు ఏంటో ఏర్పడదని ఉద్యోగులు చేస్తున్న సేవకి ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు రాష్ట్రస్థాయిలో గెజిటెడ్ ఉపాధ్యాయుల సంఘం మద్దతు ఉంటుందని అవసరమైతే రానున్న రోజుల్లో మీకోసం మేము కూడా నేరుగా ఉద్యమంలో ఉంటామని,అన్ని రకాల సహాయం అందిస్తామని తెలపడం జరిగింది. ఇప్పటికే విద్యా వ్యవస్థలు అన్ని సేవలు నిలిచిపోయారని రానున్న రెండు రోజుల్లో కేజీబీవీకి తాళాలు వేసి డి ఈ ఓ  దజేస్తామని ప్రభుత్వానికి ఉద్యోగులు హెచ్చరించారు. నిరసన కార్యక్రమానికి ఉద్యోగులు తమతో పాటు తమ పిల్లల్ని సైతం సమ్మెలో ఉన్నట్టు తెలిపారు ప్రజా పాలనలో ఆడపడుచులు రోడ్లమీద ఎక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న న్యాయం జరిగేది ఎప్పుడు అని, ఇది నా ప్రజాపాలనని ఉద్యోగులు అడిగారు ఒకవేళ కేజీబీవీ నాన్ టీచింగ్ వాళ్లను సమ్మె దీక్షలో దింపుతే జరగబోయే పరిణామానికి ప్రభుత్వం ది బాధ్యతని గుర్తు చేశారు. జిల్లా సమగ్ర శిక్ష జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు సంపత్ రాములు, సంతోష్ రెడ్డి,శైలజ, కాళిదాసు , వీణ,సాయిలు లావణ్య, శ్రీను, మాధవి,యోగేష్,బన్సీలాల్, దినేష్, రాజు, రాధికా,లింగం, కృష్ణ, మాధవి మరియుఇతరులు ఉద్యోగులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment