సడక్ పై ఖానా
-సమగ్ర శిక్ష ఉద్యోగుల వంట వార్పు
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 19:
కామారెడ్డి జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె పదవ రోజు నిరసనలో కార్యక్రమం భాగంగా వంట వార్త చేసి తమ నిరసన చేశారు. బడులలో పాఠాలు చెప్పి ఉపాధ్యాయులను రోడ్డుపైన భోజనం చేసేలా చేశారని ముఖ్యమంత్రి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి,సమగ్ర శిక్ష ఉద్యోగులు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పడాల రవీందర్ మాధవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చర్చించిన అయినా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోవడం బాధాకరం అన్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించకుంటే సమ్మె మరింత ఉదృతం చేస్తామన్నారు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు రాములు, సంతోష్ రెడ్డి,శ్రీధర్, దామోదర్ శైలజ,మాధవి,శ్రీను, వీణ, లావణ్య,కాళిదాసు,వనజ దినేష్,సంధ్యా, శంకర్,లింగం ఇతరులు పాల్గొన్నారు.