ఖేడ్: పదేళ్లకు మారిన గ్రామీణ బ్యాంకు పేరు
తెలంగాణ కెరటం నారాయణాఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 29
నారాయణఖేడ్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ ) బ్యాంకు పేరు తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారుస్తూ బోర్డు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 10 ఏళ్లకు ఆంధ్రప్రదేశ్ పేరు మారి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేశారు. ఏపీజీవీబీ బ్యాంక్ పేరు మార్చి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేశారు. ఒకటో తారీకు నుంచి ప్రజలకు సేవలు అందుబాటులోకి రానున్నాయని బ్యాంక్ మేనేజర్ తెలిపారు.