ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్షయ క్యాంటీన్ ప్రారంభించిన ఖేడ్ ఎమ్మెల్యే పి సంజీవరెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గం
తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి జనవరి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణం లోని ఏరియా ఆసుపత్రిలో ఈరోజు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా శ్రీమతి శ్రీ సునీత స్వామిదాస్ గారు ఏర్పాటు చేసిన అక్షయ క్యాంటీన్ ప్రారంభించిన నారాయణఖెడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో ఇందిరా శక్తి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు రుణాలను ఇచ్చి అనేకమంది మహిళలకు ఉపాధి మరియు వ్యాపారం కలిగించే విధంగా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీపడి వారితో సరి సమానంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు అనంతరం రిబ్బన్ కట్ చేసి క్యాంటీన్ ని ప్రారంభించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప షెట్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మరియు హనుమాoడ్లు,రాజేష్ చౌహన్,రామకృష్ణ, వివేకానంద,సద్దాం, మాజిద్,నర్సింలు, కౌన్సిలర్లు, మరియు తాహెర్ మండలాధ్యక్షులు,పండరి రెడ్డి,ముంతాజ్ సెట్ మాజీ ఎంపీటీసీలు,ముదిరాజ్ శంకర్,కట్టకింది సంజీవ రెడ్డి, జ్ఞానోబారావు పాటిల్,గుండే రావు పాటిల్ మాజీ సర్పంచ్,శ్రీకాంత్ ఛైర్మెన్,రాం రెడ్డి,కృష్ణ నాయకులు,నర్సింలు, అర్జున్ మాజీ ఎంపీటీసీ, బండారి సాయిలు తదితరులు పాల్గొన్నారు