ఖేడ్: మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకోవాలి
తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 11
నారాయణఖేడ్ పట్టణంలో గీతా జయంతి కార్య క్రమాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు శివశక్తి జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి చిత్రపటానికి పూజలతో మహా మంగళ హారతి ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజం నుండి మనమేం నేర్చుకోవాలి.. మనమేం నేర్పాలి అని విషయాన్ని గుర్తించాలని సూచించారు. విద్యార్థులు దేశ భవిష్యత్తుకు, మన సంస్కృతి, సంప్రదాయాలను నేర్చుకోవాలన్నారు.