రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
– కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, జనవరి 11 : బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా బిజెపి కిసాన్ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోడిపెల్లి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా పేరుతో ఎకరాకు ఖరీఫ్, రబీ కలుపుకొని ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొని, నేటి వరకు ఖరీఫ్ విడుదల చేయాల్సి పెట్టుబడి సాయాన్ని విడుదల చేయలేదన్నారు. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం ఆ ఊసే మరిచిందని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీలు అమలు చేయలేని మంత్రిగా ఎందుకు ఉండాలని ఏడుస్తూ ఉన్నాడని, అగ్రికల్చర్ మంత్రిగా ఉండి రైతులకు అన్యాయం చేస్తున్న నేను ఈ పదవిలో ఉండనని చెప్పుతున్నాడన్నారు. ప్రభుత్వం రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోడిపెల్లి గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.