ఈనాడు స్పోర్ట్స్ లీగ్ లో సత్తా చాటిన కోడిమ్యాల కాలేజి విద్యార్థులు
తెలంగాణ కెరటం కొడిమ్యాల ప్రతినిధి జనవరి
కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఈనాడు దినపత్రిక ఆధ్వర్యంలో కరీంనగర్ డా.బి. ఆర్. అంబేద్కర్ స్టేడియంలో సోమవారం రోజున జరిగిన
ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2024 లో పాల్గొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్ 19 బాలికల విభాగం 100 మీటర్ల పరుగు పందెంలో జి. రిషిక (సిఈసి) మొదటి స్థానంలొ, ఏ.లావణ్య (ఎంపిసి) రెండవ స్థానంలొ విజేతగా నిలిచారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ కె.వేణు విద్యార్థినిలను శాలువాతో సన్మానం చేసి అభినందించారు.
ఇంచార్జి పిడీ, అధ్యాపకులు బండ్ల భాస్కర్ ఇద్దరు విద్యార్థులు పోటీలో పాల్గొంటే ఇద్దరు విజయం సాధించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, జయాపాల్, ప్రమోద్, బాలకృష్ణ రెడ్డి, జయశీల, నర్సయ్య, అనిల్, తిరుపతి, సుమన్, ప్రవీణ్, దీక్షిత లు పాల్గొన్నారు.