కోరుట్ల బిజేవైయం పట్టణ అద్యక్షుడికి సన్మానం 

కోరుట్ల బిజేవైయం పట్టణ అద్యక్షుడికి సన్మానం 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, జనవరి 11 : జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కోరుట్ల పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో శనివారం నిర్వహించిన వేడుకల్లో రాజకీయ రంగంలో సేవలందిస్తున్న యువ నాయకుడు, భారతీయ జనతా యువ మోర్చా పట్టణ అద్యక్షులు కలాల సాయి చంద్ ను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, పాఠశాల నిర్వాహకులు శాలువతో ఘనంగా సత్కరించి, మెమోంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి పరిషత్ అధ్యక్షులు హరిస్మరణ రెడ్డి, పూర్వ విద్యార్థి పరిషత్ సహాయ కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది బొడ్ల శ్రీనివాస్, ప్రబంధ కారిణి అధ్యక్షుడు డాక్టర్ వేముల రవి కిరణ్, సమితి ఉపాధ్యక్షులు రాజ గంగాధర్, నీలి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు గోపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment