తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్
అక్రమ కేసులపైన కేటీఆర్
పసలేని కేసులు పనికిమాలిన కేసులను ప్రభుత్వం పెడుతుంది
అవినీతి జరగనే లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ పేరుతో కేసులు పెడుతుంది
ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయపరంగా ఎదుర్కొంటాం
ప్రభుత్వం తమ అధికార యంత్రాంగం చేతిలో ఉందని అడ్డగోలుగా కేసులు పెట్టినా ఎదుర్కొంటాం
నేను మొదటి రోజు చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నా… ప్రభుత్వ నిర్ణయంగా ఒక మంత్రిగా నిర్ణయం తీసుకున్న అదే మాటకు నేను కట్టుబడి ఉన్నాను
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన మాటల్లోనే అవినీతి జరగలేదని చెప్పారు…
అవినీతి ఎక్కడ ఉందని ముఖ్యమంత్రినీ అడిగితే చెప్పలేని పరిస్థితి ఉంది
ముఖ్యమంత్రి ఫార్ములా ఈ ప్రతినిధులతో కలిసిన ఫోటో బయట పెట్టడంతో ముఖ్యమంత్రి అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు
సస్పెండ్ చేస్తాను క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని బెదిరిస్తున్నాడు
మరి ఫార్ములా ఈ వాళ్లతో కలిసిన రేవంత్ రెడ్డి వాళ్లపైన ఎందుకు కేసు పెట్టలేదు
వాళ్లతో జరిగిన సమావేశాన్ని ఒక సంవత్సరం పాటు దాచి ఉంచాడు
వాళ్లతో డబ్బులు తీసుకున్నాడని అనుమానం ఉంది
అనుచిత లబ్ధి పొందింది ఫార్ములా ఈ సంస్ధ వాస్తవమైతే వాళ్లపైనే ఎందుకు కేసు పెట్టలేదు
ముఖ్యమంత్రి 600 కోట్లు అంటూ అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు
అతనితో కాంటాక్ట్లను రద్దు చేసుకోలేము అని చెబుతున్న ముఖ్యమంత్రి ఫార్ములా ఈ ని ఏ విధంగా రద్దు చేసుకున్నాడు
దీనికి ఏమన్నా క్యాబినెట్ అప్రూవల్ ఉన్నదా…
ప్రొసీజర్ పొరపాట్లు ఉంటే సంబంధిత సంస్థల దగ్గరికి వెళ్ళాలి కానీ అవినీతి కేసులు అని పెట్టడం వృధా
హైదరాబాద్ పేరు ప్రతిష్ట తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు హైదరాబాద్ నుంచి ఫార్ములా ఈ రేసు పోవద్దన్న ఉద్దేశంతోనే డబ్బులు కట్టాం
ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క రూపాయి అవినీతి కూడా అవకాశమే లేదు
ఒక పైసా అవి జరగలేదు కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం లో మరిన్ని విషయాలు చెప్పలేను
ఏసిబి ఎఫ్ఐఆర్ ని కొట్టివేయలని హైకోర్టులో కేసు నమోదు చేశాను
అయితే ఇదే అంశం పైన ఇది ఏసీబీ ఆధారంగా కేసు నమోదు చేసింది
ఇది నోటీసులు వచ్చిన మాట వాస్తవమే… కానీ ఈ ఎఫ్ఐఆర్ హైకోర్టు కొట్టి వేస్తే ఏం జరుగుతుందో చూడాలి
ఇతర కేసుల్లో మాదిరి కాకుండా ఈ కేసులో ఈడి దూకుడుగా వ్యవహరిస్తుంది…. ఏం జరుగుతుందన్నది చూడాలి
ఔటర్ రింగ్ రోడ్డు పైన ఆరోపణ చేస్తున్న ప్రభుత్వం వెంటనే ఔటర్ రింగ్ రోడ్ రిలీజ్ రద్దు చేయాలి
అవినీతి జరిగిందని ఆరోపించినప్పుడు ప్రభుత్వం లీజును ఎందుకు రద్దు చేయట్లేదు ముఖ్యమంత్రి చెప్పాలి
నాపైన ఇప్పటికే అనేక కేసులను రాష్ట్రవ్యాప్తంగా నమోదు చేసింది
రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేకసార్లు వివిధ రకాల కేసులు పెట్టి జైలుకు పంపాలని ప్రయత్నం చేసిండు
అనేక రకాల అంశాలు లేవనెత్తుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఈ మొత్తం వ్యవహారంలో నాకు డబ్బులు ఎట్లా వచ్చినయో చెప్పాలి
అనుమానాలపైన కేసులు ఉండవు కేవలం ఆధారాలపైన మాత్రమే కేసులు ఉంటాయి
రేవంత్ రెడ్డి చెప్తున్నా అబద్దాలను అసత్యాలను మీడియా యధాతధంగా ప్రచురితం చేస్తుంది
అసెంబ్లీలో కూడా అబద్ధాలు మాట్లాడుతున్న నీచపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా రాష్ట్ర అప్పుల పైన ఒక్కొక్క అబద్ధాన్ని అసెంబ్లీలో మాట్లాడారు
రేవంత్ రెడ్డికి కాదు రేవంత్ రెడ్డి తాతకు కూడా భయపడనుకాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం పరిపాలన పైన కేటీఆర్ స్పందన
సంవత్సర కాలం పాటు ప్రతికూల రాజకీయ పరిస్థితులు ఉన్న ఒక్క సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలిగాము
మా పార్టీ శ్రేణుల్లో నాయకుల్లో ఉత్సాహం నెలకొంది
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని, ముఖ్యంగా రుణమాఫీ రైతు భరోసాను ప్రజలకు ఇవ్వలేకపోయమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి
రాష్ట్ర ప్రజలను మోసగించే కుట్రలతోనే నూతన సంవత్సరాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించబోతుంది
కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయద్దు నిరూపించింది
ఒకవైపు రైతు భరోసాను ఎత్తకొట్టడం.. బీసీలను మోసపుచ్చడం అనే రెండు ప్రయత్నాలతో నూతన సంవత్సరాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించబోతున్నది
కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరాని ధోకా నామ సంవత్సరంగా చెప్పుకుంటే బాగుంటుంది
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలు… గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీకి శాపాలై చుట్టుకున్నాయి
రైతు భరోసా ఎగకొట్టి రైతుల నోట్లో మట్టికొట్టింది ప్రభుత్వం
26 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా ఎగగొట్టడం వలన భాకీ పడింది
ఎవరికి రైతు భరోసా ఇస్తారు అని విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదు
ఎవరు పంట వేస్తున్నారు ఎవరు గుర్తుపట్టి రికార్డులకెక్కిస్తారు… అంత యంత్రంగా ప్రభుత్వానికి ఉన్నదా… 72,000 కోట్లు సాఫీగా రైతుల ఖాతాలోకి పోయిన కార్యక్రమాన్ని గందరగోళంగా మారుస్తున్నది… అంతిమంగా ఈ వ్యవహారం అవినీతికి దారి తీస్తుంది
ఓకే కాలం పంట వేసే రైతులకు, దీర్ఘకాలిక పంటలు వేసే రైతులకు పోడు భూములు సాగు చేసుకునే గిరిజనులకు రైతు భరోసా ఎగబట్టి కుట్రను ప్రభుత్వం చేస్తున్నది
బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ను అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పోతున్నది
కోర్టు కేసులపేరు చెప్పి బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషను ఆపే ప్రయత్నం చేస్తుంది
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజాఉద్యమాల ద్వారా ఎండగడతాం
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని గ్యారంటీని అమలు అయ్యేదాకా వెంటపడతాం
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం
స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి నివాళి కోసం సంతాపం కోసం ఏర్పాటుచేసిన తీర్మానాన్ని సమర్థించాము
అదేవిధంగా తెలంగాణ బిడ్డ ప్రధాని గారికి పి వి గారికి స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాం
వెంటనే ఈ అంశంలో అధికారిక తీర్మానం చేసి మెమోరియల్ కట్టాలి
ఢిల్లీలో పివి గారికి స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని భారతరత్న ఇవ్వాలని గతంలో భారత రాష్ట్ర సమితి తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది
*రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడతాం వెంటపడతాం*
డిస్టక్షన్ డిస్ట్రక్షన్ డైవర్షన్ Distraction, Distraction, Diversion (3D) ఇదే త్రీడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం
హైడ్రా పేరుతో విధ్వంసం… అటెన్షన్ డైవర్షన్ ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ విధానం
మా ప్రభుత్వానికి నీళ్లు నిధులు నియామకాలు అని నినాదం ఉంటే ఈ ప్రభుత్వానికి ఈ త్రీ డి ఫార్ములా ఉంది
ఈ త్రీడీ ఫార్ములాని అమలు చేస్తుంది కేడి ముఖ్యమంత్రి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వం మోసాలను ప్రభుత్వ లూటీని ప్రజలకు అర్థమయ్యేలా తెలియ చెపుతాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కోసం కాకుండా అల్లుడి కోసం అన్నదమ్ముల కోసం బావమరిది కోసం పనిచేసేది
ప్రజల పైన సోషల్ మీడియా కార్యకర్తల పైన ప్రతిపక్ష నాయకుల పైన అక్రమంగా కేసులు పెట్టడానికే ఈ ప్రభుత్వం సంవత్సర కాలాన్ని గడిపింది
కాంగ్రెస్ పార్టీ అవినీతిని అరాచకాలను ఢిల్లీ సాక్షిగా ఎండగట్టాం.
అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం సివిల్ సప్లై కుంభకోణం అమృత్ టెండర్ల కుంభకోణం మంత్రులపై పొంగులేటి పై జరిగిన ఈడి దాడి వంటి అంశాల నుంచి బిజెపి ప్రభుత్వం ఒక రక్షణ కాపాడుతుంది
కచ్చితంగా బిజెపి పార్టీ బిజెపి పార్లమెంటు సభ్యులు, బిజెపి కేంద్ర మంత్రులు రేవంత్ రెడ్డికి రక్షణ గోడలెక్క నిలబడ్డారు
మేము లేవనెత్తిగా సివిల్ సప్లైస్, అమృత్ కుంభకోణాలపై కేంద్రం ఎందుకు స్పందించలేదు
పొంగులేటి ఇంటి పైన జరిగిన ఈడి దాడుల పైన ఎందుకు స్పందించలేదనే రాష్ట్ర ప్రజలకు తెలియచెప్పాలి
రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కార్యక్రమాల్లో బిజెపి పార్థ పరోక్షంగా ఉన్నదని అర్థమవుతుండదు
*పార్టీ కార్యక్రమాలు పైన కేటీఆర్*
2025 సంవత్సరంలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం
పార్టీ శిక్షణ కార్యకలాపాలను సభ్యత్వ నమోదు కార్యకలాపాలు చేపడతాం
ఇదే సమయంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుంది
గ్రామంలోని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని స్టైల్ లో పార్టీని బలోపేతం చేస్తూ
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం
టీచర్ మరియు గ్రాడ్యుయేట్ ఎన్నికల అంశంలో పార్టీగా నిర్ణయం తీసుకొని చెప్తాము
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు రాష్ట్రస్థాయిలో కమిటీని
త్రిబుల్ ఆర్ రోడ్డు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది
అప్పటి ప్రభుత్వమే క్యాబినెట్లో ఆమోదం కూడా తెలిపింది
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక చేసింది ఏమీ లేదు
ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా సంవత్సరంలో లక్ష 39 వేల కోట్ల ఆప్పు ఎందుకు చేసింది
ఒక్క కార్యక్రమం చేపట్టకుండా ఈ అప్పులన్నీ ఢిల్లీకి పంపిస్తున్నారు
ఒక రాష్ట్రం ఒక్క సంవత్సరంలో ఇంత పెద్ద అప్పు చేయడం దేశంలోనే రికార్డ్
మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని ఈ విధంగా అప్పుల పాలు చేస్తుంది
అప్పుల కోసమే అప్పులు చేస్తున్నామని మీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుంది
అల్లు అర్జున్, సినిమా వ్యవహారంలో కేటీఆర్ స్పందన
కొంత ప్రచారం కావాలి, ప్రజా సమస్యల పై నుంచి అటెన్షన్ డైవర్షన్ లో భాగంగానే సినిమా వాళ్ళ పైన రేవంత్ రెడ్డి మాట్లాడారు
రాష్ట్రంలో జరిగిన మరణాలపైన రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన గురుకుల పాఠశాల విద్యార్థులకు… ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలి
వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళు కుటుంబాలు కాదు మనుషులు కాదు అన్నట్టు.. సినిమా వాళ్లపైన పడి అటెన్షన్ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి పాకులాడారు
సినిమా వాళ్ళ నుంచి సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు సైలెన్స్ గా ఉన్నాడు
సినిమా వాళ్ళతోపాటు ఆత్మహత్యలు చేసుకున్న గురుకుల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రైతన్నలు, నేతన్నల మరణాల పైన స్పందించాలి
వీళ్ళకి కూడా కనీసం 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి