*బిఆర్ఎస్ పార్టీలో చేరిన కుందుగారి రామ్ రెడ్డి*
– కండువా కప్పి ఆహ్వానించిన రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
తెలంగాణ కెరటం డిసెంబర్ 21 గుమ్మడిదల మండలం పటాన్ చెరువు ప్రతినిధి
గుమ్మడిదల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందుగారి రామ్ రెడ్డి శనివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షులు దాసరి ఆంజనేయులు యాదవ్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి చిరుమని శ్రీనివాస్ కవ్వం మల్లారెడ్డి నల్ల రాజు గౌడ్ నల్ల రవి గౌడ్ యాదగిరి పెంటయ్య పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.