వీరారెడ్డిపల్లి లో వీధి కుక్కల దాడికి గొర్రె పిల్లలు బలి

వీరారెడ్డిపల్లి లో వీధి కుక్కల దాడికి గొర్రె పిల్లలు బలి

తెలంగాణ కెరటం గుమ్మడిదల మండలం పటాన్ చెరువు ప్రతినిధి జనవరి

గుమ్మడిదల మండలం వీరారెడ్డి పల్లి గ్రామంలో మధ్యాహ్న సమయాన వీధి కుక్కల దాడిలో సుక్క కృష్ణ మైపాల్ కుటుంబానికి చెందిన సుమారు పదిహేను గొర్రె పిల్లలు మృతి చెందాయి కృష్ణ మిగతా గొర్రెల కాపరిగా వెళ్ళాడు కావున నేను ఆసుపత్రికి వెళ్ళగా గొర్రె పిల్లలు దొడ్డిలో ఉండిపోగావాటిని వీది కుక్కలు దాడి చేసి చంపేసాయి అంటూ కన్నీరు మున్నీరయ్యారు ఇలా ఇదివరకే ఎన్నోసార్లు కోళ్లు మేకలు దుడ్డెలను ఈ గ్రామం దాడి చేసి చంపేశాయని చుట్టుపక్కల వారు తెలియజేశారు మా ఊర్లో కుక్కలు ఎక్కువయ్యాయిఅంటు వీటిపై కఠిన చర్య తీసుకోవాలని గ్రామపంచాయతీలో మండల ఆఫీసులలో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా దరఖాస్తులు చేసిన పట్టించుకోలేరంటూ తెలియజేశారు పశువుల ప్రాణాలే ఈ విధంగా చేస్తే మనుషులపై దాడి చేయవన్న నమ్మకం ఏముందని ప్రశ్నించారు ఇకనైనా నాయకుల్లారా మండలాధికారులారా మా ఊరిలో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూస్తూ ఇప్పుడు జరిగిన ఈ ఘోరానికి దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని పదేపదే ప్రాధేయపడుతూ పశుపక్ష ప్రాణాలు పోతే మళ్ళీ తేగలం కొనగలం కానీ మనుషుల ప్రాణాలు పోతే తేలేం కొనలేమంటూ గ్రామంలో మరెందరో భయానికి గురైతున్నారంటూ మళ్లీ మళ్లీ మమ్మల్ని ఆదుకోవాలని వారు తాతయ్య పడుతూ కోరారు

Join WhatsApp

Join Now

Leave a Comment