మాలల సింహగర్జనకు అచ్చంపేట నియోజకవర్గం నుండి తరలి వెళ్లిన నేతలు ఉద్యోగ సంఘం నాయకులు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 1):
హైద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ ఆదివారం నిర్వహించే మాలల సింహ గర్జన బహిరంగ సభ కు అచ్చంపేట నియోజకవర్గంలోని అచ్చంపేట ,అమ్రాబాద్, లింగాల,చరగొండ, బాల్మూర్, ఉప్పుంతల, వంగుర్ పదరా, మండల నుండి మాల సంఘం ప్రతినిధులు కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో తరలి వెళుతున్నట్లు. మాల ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షుడు కే. ఆంజనేయులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై మాల అంటూ నినాదాలు చేశారు. దాదాపు 300 వందల వాహనుల లో తరలీ వెళుతున్నట్లు వారు తెలిపారు.
మాల మహానాడు రాష్ట్ర నాయకులు కుంద మల్లికార్జున్,బాలస్వామి,రవీందర్,జీవన్,జనార్ధన్,తదితరులు ఉన్నారు.