రంగారావుపేట ఏరియాలో చిరుత సంచారం.?
తెలంగాణా కెరటం : మెట్ పల్లి ప్రతినిధి, డిసెంబర్
మెట్పల్లి మండలం రంగారావుపేట గ్రామ శివారు ప్రాంతాలలో చిరుత పులి సంచరిస్తుంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. చిరుత పులి ఎక్కడ తమ గ్రామాలవైపు వస్తుందో, ఎవరికి హాని తలబెడుతుందో అని ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు, స్థానికుల కథనం ప్రకారం..
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రంగారావుపేట గ్రామ సమీపాన గల ఓ ఫాం హౌస్ ఏరియాలో, ఆదివారం రోజున ఓ శునకాన్ని చంపి పీక్కు తిన్నట్టు, గ్రామస్థుడు రమేశ్కు ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే అతను ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సయ్యద్ సత్తర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, చచ్చి పడి ఉన్న శునకాన్ని పరిశీలించాడు. అంతేగాక, చుట్టుపక్కల గల పరిసర ప్రాంతాలను సైతం పరిశీలించాడు. అక్కడ కాలి ముద్రలు కనబడడంతో దాన్ని సేకరించి, ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఐతే, ఈ రోజు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్లు పద్మా రావు, చైతన్యశ్రీ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు . ఐతే, కాలి ముద్రలను చూస్తే అని ఒక్క చిరుత పులి కావొచ్చని అవగాహనకు వొచ్చారు…..