శ్రీశైలంలో చిరుతపులి కలకలం.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి
శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంట్లోకి అర్ధరాత్రి చిరుత చొరబడింది. ఆదివారం రాత్రి చిరుత ఇంట్లోకి వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డైన ఫుటేజీని సోమవారం చూసిన పూజారి కుటుంబం షాక్‌కు గురైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చిరుతల సంచారం ఎక్కువగా ఉండటంతో అటవీ శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.