జిల్లా సమగ్ర అభివృద్ధికై ఉద్యమాలు చేద్దాం
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 15):
జిల్లా సమగ్ర అభివృద్ధికై ఉద్యమాలు చేపడుద్దామని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాగర్ అన్నారు జిల్లా అచ్చంపేట పట్టణంలో సిపిఎం పార్టీ మూడవ జిల్లా మహాసభల్లో రెండో రోజు భాగంగా ప్రతినిధుల సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్
అచ్చంపేట పట్టణంలోని లోటస్ ఫంక్షన్ హాల్ లో ఎన్నుకోబడిన ప్రతినిధుల మహాసభలో మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాకు నల్లమల్ల అడవులు ఆనుకొని ఉన్న పరిశ్రమలకు నిలియంగా ఉన్న ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం తగదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వము కాగితపు పరిశ్రమ నెలకొల్పి ఈ ప్రాంతంలో గిరిజన దళితులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ లతోపాటు ఏడో గ్యారెంటీ కూడా అమలు చేస్తామని ప్రతి బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారని, ఈ దేశంలో ప్రజల పక్షాన మాట్లాడే ప్రతి పౌరుడు స్వేచ్ఛగా స్వయంగా వచ్చి కలిసి తమ గూడును చెప్పుకోవచ్చు అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు . ప్రభుత్వము ఏడాది కాలంలోనే ప్రజావ్యతిరేక విధానాలు తెలంగాణ రాష్ట్రంలో అవలంబించడం సరైన పద్ధతి కాదని వారు అన్నారు. లగచర్లలో భూములు గిరిజనులు కోల్పోతే వారికి అండగా ఎర్రజెండా సిపిఎం పార్టీ పర్యటనక బయలుదేరి ఎవ్వడొచ్చినా ఆగేది లేదని హెచ్చరించి పర్యటన చేసి వారి యొక్క సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన తర్వాతనే ముఖ్యమంత్రి ఫార్మా ఇండస్ట్రీని ఆ ప్రాంతంలో నిర్మాణం చేయమని చెప్పి వెనక్కి తగ్గారని వారు అన్నారు.ప్రజా పోరాటాలు బలంగా ఉన్నటువంటి ప్రాంతాలలో పాలకులు అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని ఈశాన్య రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వం ఓటమి చవిచూసిందని మూడోసారి 400 సీట్లు అధికారంలోకి వస్తామని చెప్పిన అమిత్ షా మోడీ జోడికి తిరుగులే లేదని సమయంలో నితీష్ కుమార్ తో అధికారంలోకి రావడం చూస్తున్నామని వారు అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించకుండా ప్రజలు ఇచ్చే హామీలు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పై దృష్టి పెట్టి పనిచేయాలన్నారు.
ఈ దేశ సంపదను బడా పెట్టుబడిదా పెట్టుబడిదారులకు కట్టబెట్టడం దుర్మార్గం అన్నారు. దేశంలో ఉండే కొద్దిమంది శతకోటీశ్వరులకు 16 నారు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం దుర్మార్గమని వారు అన్నారు. రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలంటే బడ్జెట్ లేదని మాట్లాడడం దూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రతి వస్తువుకు జీఎస్టీ పేరుతో 18 శాతం తీసుకుంటున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే వాటలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించడం మిగతా రాష్ట్రాలకుకేటాయించకపోవడం సరైనది కాదని రాజ్యాంగ హక్కులను కాలరాయడం దుర్మార్గమని గుర్తు చేశారు..
ఈ దేశంలో ఇది భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా మనువాద సిద్ధాంతాన్ని అమలు చేసే దానికోసం ఆర్ఎస్ఎస్ బిజెపి ప్రయత్నం చేస్తుందని, ఈ దేశంలో మత ఘర్షణలు సృష్టించడం కోసం హిందూ ముస్లింల మసీదులను తువ్వాలని చెప్పి బహిరంగంగానే ప్రకటన చేస్తూ మాట్లాడడం దుర్మార్గమని, రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకొని పరిపాలన కొనసాగించాలని గుర్తు చేశారు.పాలకులు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ య సమస్యలపై పోరాడే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు.
ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు ఊడగోట్టిరు తప్ప ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్నారు. కేంద్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీ పోస్టులను ఇప్పటివరకు భర్తీ చేయడం లేదని గుర్తు చేశారు.మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో జరుగుతున్న అల్లర్లను పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు.కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీ ప్రజలను బూచిగా చూపి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజా పరిపాలన ప్రజా సమస్యల పట్ల కార్మికుల సమస్యల పట్ల రైతాంగ సమస్యల పట్ల నిరుద్యోగ సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వారు గుర్తు చేశారు.
ఈ దేశంలో రాష్ట్రాలలో ప్రశ్నించే గొంతులను నిర్బంధించడం దాడులు చేయడం అర్బన్ నక్సలైట్ రుద్రవేసి అరెస్టు చేసి సంవత్సరాలకు జైలుకు పంపడం దుర్మార్గమని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఎన్ని సంక్షేమ ప్రభుత్వాలు అవలంబించిన నియంతృత్వం ఇసుక చెంది ప్రజలు ఓడించారని ప్రధానంగా గ్రామీణ ప్రజలే దీనికి కారణమని గుర్తు చేశారు. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు కాకుండా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే దానికోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు అన్నారు ప్రజాస్వామ్య హక్కులను ఖూనీ చేస్తే సహించేది లేదన్నారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రెండు తపాలు 15000 చొప్పున చేయాల్సిన ప్రభుత్వం వేయకుండా కాలయాపనం చేస్తుందని కౌలు రైతులకు కూడా భరోసా ఇస్తామని వాగ్దానం ఇచ్చింది వాటిని వెంటనే చూపాలని గుర్తు చేశారు ప్రభుత్వం. డబ్బులు లేవని పూజితతో గత పాలకులు చేసిన కాంట్రాక్టర్లకు 50 వేల కోట్ల రూపాయలు ఎట్లా ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ రాష్ట్ర నాయకులు కి కిల్లె గోపాల్, వెంకట్ రాములు, ధర్మానాయక్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యులు దేశా నాయక్ ఆర్ శ్రీనివాసులు, గీత, బి ఆంజనేయులు, సి. ఆంజనేయులు, జిల్లా నాయకులు మల్లేష్, శంకర్ నాయక్, ఈశ్వర్, నరసింహ, అశోక్, దశరథం,నిర్మల,వర్ధన్ సైదులు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.