చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయండి.
వికలాంగుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పులిజాల బాలేశ్వర్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 28):
చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు కురుమయ్య ఆ సంఘం సహకార దర్శి పులిజాల బాలేశ్వర్ అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలోఎన్.పి.ఆర్.డి.
వికలాంగుల సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు కురుమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పులిజాల బాలీశ్వర్ ముఖ్యఅతిథిగా పాల్గొని వారు. మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వికలాంగులకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 10వ తేదీన సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా కార్యక్రమంనిర్వహిస్తున్నామనిఈ ధర్నా కార్యక్రమానికి వికలాంగుల అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. నాగర్ కర్నూల్ జిల్లాలో వికలాంగుల సంక్షేమ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని బాలీశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో వికలాంగులకు సమాచారం ఇవ్వటం లేదని అన్నారు. కేవలం ఇద్దరు, ముగ్గురు పైరివీకారుల చేతుల్లో వికలాంగుల శాఖ కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా వికలాంగుల శాఖ అధికారులు పద్ధతి మార్చుకొని జవాబుదారీగా పనిచేయాలని కోరారు. వికలాంగుల సంక్షేమ శాఖ పనితీరు మారకపోతే రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కురుమయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి పులిజాల బాలీశ్వర్, జి. ఆంజనేయులు, ఎల్లయ్య, లలిత్ కుమార్, నాగరాజు, బంగారయ్య, రాష్ట్ర కమిటీ మెంబర్ జిల్లా గౌరవ సలహాదారు కోట్ల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.