గొల్లగట్టు సంస్కృతిక చరిత్రను కాపాడుకుందాం
గొల్లగట్టును రాష్ట్ర పండుగగా గుర్తించాలి .
ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ . డి సి ఎం ఎస్. చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ .
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో జనవరి 11న జరగనున్న గొల్లగట్టు సాంస్కృతిక చరిత్ర సెమినార్ పోస్టర్‌ను ప్రముఖులతో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ . డి సి ఎం ఎస్ . చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ గారు ఆవిష్కరణ చేశారు.ఫిబ్రవరిలో జరగబోతున్న గొల్లగట్టు లింగమంతుల జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని,పూర్తికాల చైర్మైన్,కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.జాతర సమయంలోనె పరిమితమైన నిధులు కాకుండ అధిక నిధులు కెటాయించి సంవత్సరం పొడవున మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.గొల్లగట్టు జాతరపై అగ్రవర్ణాలు చేస్తున్న కుట్రలను మానుకొని అక్కడ యాదవుల ఆశ్రిత కులాలైన బైకాని వారిని ప్రభుత్వం గుర్తించాలని,వారికి ప్రభుత్వ జీతలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో పిల్లి రామరాజు యాదవ్, ఆర్ లక్ష్మణ్ యాదవ్,గడ్డం శ్రీనివాస్ యాదవ్,కేశబోయిన మల్లయ్య యాదవ్.క్రిష్ణ యాదవ్,బారి అశోక్ యాదవ్,కడారి రమేష్ యాదవ్, నూకల మధు,కాయిత సతీష్ సతీష్,నానబాల సంతోష్ యాదవ్ ,మహేష్,శివర్ల శంకర్,సురేష్ యాదవ్ పాల్గొన్నారు.