వేగం కన్నా ప్రాణం మిన్న
—బెజ్జంకి ఎస్ఐ జె కృష్ణారెడ్డి
తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి జనవరి 15 :
రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా బుధవారం మండలంలోని బెజ్జంకి క్రాస్ రోడ్డు వద్ద ఎస్ఐ జె కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహనా కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర పోలీస్ శాఖ జనవరి నెలను రోడ్డు భద్రతా మాసం గా ప్రకటించిందని, ఇందులో భాగంగా ప్రతిరోజు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనల పై, వాహనాలు నడిపేటప్పుడు తీసుకునే జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరుగుతుందని, ప్రజలు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, వేగం కంటే ప్రాణం ఎంతో విలువైనదని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి పోలీస్ సిబ్బంది, బెజ్జంకి క్రాసింగ్ గ్రామ ప్రజలు, ఆటో డ్రైవర్ లు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.