తుషార్ గాంధీని సన్మానించిన లోకల్ ఆటో యూనియన్ నేతలు.

తుషార్ గాంధీని సన్మానించిన లోకల్ ఆటో యూనియన్ నేతలు.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (జనవరి 11):

మహాత్మా గాంధీ మనవడు అచ్చంపేట పాదయాత్రలో భాగంగా శనివారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణానికి వచ్చిన సందర్భంగా పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సమక్షంలో రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ నాయకులు గాంధీ మహాత్ముడి మనవడు తుషార్ గాంధీ కి ఘనంగా స్వాగతం పలుకుతూ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాలు కప్పి పూలమాలలు వేసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజంగా అచ్చంపేట ప్రాంతానికి మహాత్మా గాంధీ గారే వచ్చినట్టుగా హర్షం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ అహింస,శాంతి, ధర్మాన్ని, పాటించిన మహానుభావులు మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవాలని అన్నారు.పాదయాత్ర చేపట్టినటువంటి విజయకుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ రహీం లోపల ఆటో యూనియన్ అధ్యక్షులు మహబూబ్ అలీ, గౌరవ అధ్యక్షులు అశు, గౌరవ సలహాదారులు కాజమీయా, గౌరవ పెద్దలు చందు, గౌరవ పెద్దలు కాజమీయా పెద్దలు హరి సింగ్, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment