---Advertisement---

సర్వ మానవాళికి రక్షకుడు యేసు ప్రభువు

---Advertisement---

సర్వ మానవాళికి రక్షకుడు యేసు ప్రభువు

 

నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన చైర్పర్సన్ అన్నపూర్ణ

 

 

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 22 :

సర్వ మానవాళికి రక్షకుడు యేసు ప్రభువని ఆయన బోదనలు ప్రపంచానికి ఆదర్శణీయమని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. బాలెంల కృష్ణ ప్రమీల దంపతుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి 13వ వార్డు గాంధీనగర్లో ఏర్పాటు చేసిన సెమి క్రిస్మస్ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రతి మానవుడు ఇతరులపై ప్రేమ, కరుణ చూపాలని ప్రతి ఒక్కరు శాంతిమయంగా కరుణామయులై జీవితాలు గడపాలని తెలిపాడన్నారు. మానవులను పాపాలను తొలగించేందుకే యేసుక్రీస్తు భూవిపైకి దిగి వచ్చాడన్నారు. క్రైస్తవ జనులంతా భక్తి శ్రద్దలతో యేసుక్రీస్తును ఆరాధిస్తూ క్రిస్మస్ వేడుకలను ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలన్నారు. బాలెంల కృష్ణ ప్రమీల దంపతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం ప్రభువుపై వారికున్న ప్రేమ, భక్తికి నిదర్శనమన్నారు. అనంతరం 50మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ నాయకులు పెద్దపంగు పూర్ణశశికాంత్, విజయ రెశిష్టు, ఎలియా ఫాస్టర్, యేసురాజు, బాలెంల కృష్ణ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment