నేటి నుండి మద్దిమడుగు ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు.
తెలంగాణ కెరటం అచ్చంపేట (డిసెంబర్ 10):
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం మండలం నల్లమల అటవీ ప్రాంతంలో గల మద్దిమడుగు గ్రామంలో వెలసిన పబ్బతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు నేడు 11వ తేదీ నుంచి ఈనెల 15 వరకు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా అంజన్న మాలలు ధరించిన స్వాములు 41 రోజులపాటు కఠోర దీక్ష చేసి మాల వితరణ కార్యక్రమం చేపట్టే కార్యక్రమం అనవాయతిగా వస్తుంది మద్దిమడుగు అంజన్న బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోని నలుమూలన నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి మరియు ఏపీ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు మాలలు ధరించిన స్వాములకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు హోమం నిర్వహించడం జరుగుతుందని, ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా వివిధ ప్రాంతాలనుంచి తదితరులు వచ్చే భక్తులకు ఆలయ అధికారులు చైర్మన్ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.