మద్యం సేవించి వాహనాలు నడపరాదు: మాగనూరు ఎస్సై అశోక్ బాబు.
తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,
వాహనదారులు మద్యపానం సేవించి వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మద్యపానం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ అశోక్ బాబు తెలిపారు.మాగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ రోజు సాయంత్రం ప్రధాన రహదారిపై ఎస్సై అశోక్ బాబు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ… వాహనదారులు మద్యపానం సేవించి వాహనాలు నడపరాదని మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల చాలావరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు. అలాగే కార్ అద్దలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని ఎవరైనా కార్ అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగిస్తే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కొన్ని సూచనలు చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపరాదు. వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించవలెను. వాహనదారులు రోడ్డుపై వాహనాలను పార్కు చేయరాదు. టూ వీలర్స్ పై ఇద్దరకు మించి ప్రయాణించరాదు. ఆటోలలో ఎక్కువ మంది పిల్లలను కూలీలను ఎక్కించుకోరాదు. ఆటోలో సీట్ పర్మిట్ ఉన్నంతవరకే ప్యాసింజర్ ఎక్కించుకోవాలి. డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ మాట్లాడరాదు. రేస్ డ్రైవింగ్ . పరిమిత వేగంలో వాహనాలు నడపాలి. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీస్ వారికి సహకరించాలని ఎస్ఐ కోరారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.