తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 03 : కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్ లో గురువారం మహాత్మ జ్యోతిబాపూలే 134,వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకులు కృష్ణారావు మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే కుల వ్యతిరేక సంఘసంస్కర్త, గొప్ప రచయిత అని అన్నారు. పూలే అంటరానితనం నిర్మూలన కోసం పని చేశాడన్నారు. అణగారిన ప్రజలకు సమాన హక్కులను సాధించడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాకల నర్సయ్య, ఉపాధ్యక్షుడు ఎం.ఏ నయిం, పోతుగంటిశంకర్ గౌడ్, చిట్యాల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడ్ల రమేష్, తెడ్డు విజయ్, పసుల కృష్ణ ప్రసాద్, సదుల వెంకటస్వామి, బోయిని నాగరాజ్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి వేడుకలు
Published On: November 29, 2024 6:48 am
---Advertisement---