---Advertisement---

రామాయంపేటలో నాయకులు, ప్రజల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 134వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు.

---Advertisement---

ఈ కార్యక్రమాన్ని పోచమ్మల అశ్విని శ్రీనివాస్ ఏర్పాటు చేశారు.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి నవంబర్ 28:

మహాత్మ జ్యోతిబాపూలే134వ వర్ధంతి కార్యక్రమం ను రామయంపేట పట్టణంలో నాయకులు, ప్రజల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమం పోచమ్మల అశ్విని శ్రీనివాస్ ఏర్పాటు చేయగా నాయకులు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే మొట్టమొదటి సంఘసంస్కర్త అని, ఈ మహాత్ములు లేకపోయి ఉంటే ఈరోజు బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇంతటి ప్రాముఖ్యత దక్కేది కాదని అన్నారు.పూలే దంపతులు గొప్ప సంఘసంస్కర్తలు అని అన్నారు.
అలాగే ఈ మహాత్మాలు పంచిన జ్ఞానమును పునికి పుచ్చుకొని ఇక్కడి ప్రాంత ప్రజలకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు,బిజెపి పార్టీ నాయకులు, బిసి,ఎస్సీ సంఘాల నాయకులు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment