జిల్లా మహాసభలను విజయవంతం చేయండి
ప్రచార ఆటో జాత ప్రారంభం.
జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశా నాయక్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి అచ్చంపేట (డిసెంబర్ 12):
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట సిపిఎం పార్టీ జిల్లా మహాసభల ప్రచార ఆటో జాతను గురువారం అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దర్శనాయక్ ప్రారంభించారు.ఈనెల 14,15 తేదీలలో జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని అచ్చంపేట పట్టణంలో ఆటో ప్రచార జాతను ప్రారంభం చేస్తూ మాట్లాడుతున్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశా నాయక్.. ఈ దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజా పోరాటాలు నిర్వహించే పార్టీ సిపిఎం నాగర్ కర్నూలు జిల్లా మూడవ మహాసభలు నల్లమల్ల అచ్చంపేట పట్టణంలోజరుగుతున్నాయని ఈ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఈ నియోజకవర్గంలో ఉండే రైతులు, కూలీలు, కార్మికులు, కష్టజీవులు, యువత, మహిళ, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ మహాసభలలో జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి చేయుట అనేక వనరులు ఉన్న చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న పాలకవర్గాలపై రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలు కార్యచరణ రూపొందించబోతున్నామని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం కావస్తున్న ప్రజలు ఆశించినట్టుగా పరిపాలన కొనసాగటం లేదని ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజల పక్షాన రాబోయే కాలంలో ప్రజా పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు మల్లేష్ శంకర్ నాయక్, సీనియర్ నాయకులు శివకుమార్, బి.రాములు, లక్ష్మయ్య, పార్వతి, వెంకటేష్, రాములు, కార్య భరత్ తదితరులు ఉన్నారు.