తెలంగాణ కెరటం నారాయణాఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి 28 నవంబర్
శ్రీరామమందిర అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో ఈనెల 30న ఖేడ్లో రామాలయం వద్ద మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు గురుస్వాములు కే.శివానంద్, మోహన్గాడ్ తెలిపారు. రక్తదాతలు అధికసంఖ్యలో వచ్చి రక్త దానం చేసి శిబిరాన్ని జయప్రదం చేయాలన్నారు. ఒకరి రక్తం మరొకరి ప్రాణం అన్నారు. మధ్యాహ్నం 12:30 నుంచి రక్తదాన శిబిరం ప్రారంభం కానుందన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.