---Advertisement---

సిపిఎం పార్టీ జిల్లా మూడవ మహాసభలను విజయవంతం చేయండి.

---Advertisement---

సిపిఎం పార్టీ జిల్లా మూడవ మహాసభలను విజయవంతం చేయండి.

 

తెలంగాణ కెరటం అచ్చంపేట (డిసెంబర్ 11):

 

సిపిఎం పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా మూడవ మహాసభలు డిసెంబర్ 14, 15 తేదీలలో అచ్చంపేట పట్టణంలో జరుగుతున్నాయని ఈ మహాసభలకు రైతులు కార్మికులు యువకులు నిరుద్యోగులు, మహిళలు సిపిఎం పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్డం పర్వతాలు కోరారు.బుధవారం అచ్చంపేట పట్టణంలోని టీఎన్జీవో భవనంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశా నాయక్ అధ్యక్షత న జిల్లా కార్యదర్శి పర్వతాలు మాట్లాడుతూ 2021 వ సంవత్సరంలో కల్వకుర్తి పట్టణంలో జరిగిన రెండో మహాసభ నుంచి ఈ మహాసభ వరకు మూడేళ్ల కాలంలో పార్టీ చేసిన ఉద్యమాలు పోరాటాలు కృషి వాటన్నిటిని సమీక్ష చేసుకొని ఈ మహాసభ నుంచి మళ్లీ వచ్చే మహాసభ వరకు చేయాల్సిన ఉద్యమ కార్యచరణలు ఈ మహాసభలలో రూపొందించబోతున్నామని వారు అన్నారు. ప్రధానంగా అచ్చంపేట నాగర్కర్నూలు, వనపర్తి, ప్రాంతాల మీదుగా రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేసే దానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి రైలు మార్గాన్ని ఏర్పాటు చేసే అంశం పైన మహాసభలలో చర్చించబోతున్నామని వారు అన్నారు. పాలమూరు, రంగారెడ్డి, ప్రాజెక్టును జాతీయ హోదా కేంద్ర ప్రభుత్వం కల్పించాలని ఆ తీర్మానాన్ని కూడా మహాసభలలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని నల్లమల్ల ప్రాంతం ప్రపంచంలోనే పేరుగాంచిన అటవీ వనరులు ఉత్పత్తులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పరిశ్రమలకు నిలయంగాఉన్నటువంటిదని పరిశ్రమలు కల్పించకుండా పాలకులు చేస్తున్న నిర్లక్ష్యంపైమహాసభలలో చర్చించి ఎదురు బొంగు పరిశ్రమలు కల్పించి ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశాల పట్ల కూడా మహాసభలలో చర్చిస్తామని అన్నారు సిపిఎం పార్టీ జిల్లా మహాసభలో రెండు రోజులుజరుగుతున్నాయని మహాసభలో ఈ ప్రాంత ప్రజల ఉపాధి ఉద్యోగ ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి సాగునీరు అనేక అంశాల పైన చర్చించి రాబోయే కాలంలో ఉద్యమ కార్యచరణ రూపొందించి పోరాటాలకు నాంది పలుకుతున్నదనివారు అన్నారు.ఈ సభకు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు బీవీ రాఘవులు, ప్రజా ప్రజావాగ్గేయకారుడు గోరేటి వెంకన్న, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ, సాగరు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు మల్లేష్, శంకర్ నాయక్, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు శివకుమార్, బి రాములు,నాయకులు సైదులు, సయ్యద్, మనోజ్,ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment