---Advertisement---

టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర 6 వ విద్యా వైజ్ఞానిక మహాసభలను, నల్లగొండ లో విజయవంతం చేయండి

---Advertisement---

టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర 6 వ విద్యా వైజ్ఞానిక మహాసభలను, నల్లగొండ లో విజయవంతం చేయండి

 

తెలంగాణ కెరటం :నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 21

 

నారాయణఖేడ్ నందు టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించిన మండల విద్యాధికారి మరియు టి ఎస్ యుటిఎఫ్ నాయకులుతెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ( టీఎస్ యుటిఎఫ్ ) రాష్ట్ర ఆరవ విద్యా వైజ్ఞానిక మహాసభల గోడపత్రికలను మండల వనరుల కేంద్రం నారాయణఖేడ్ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కంబపురం అశోక్ మాట్లాడుతూ విద్య,వైజ్ఞానిక మహాసభలు నల్లగొండలో డిసెంబర్ 28 29 30 తేదీలలో జరుగుతున్నాయని ఇట్టి మహాసభలకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ మహాసభల్లో ప్రభుత్వ విద్యారంగంపై మేధావులతో లోతైన చర్చ జరుపబోతున్నామని తెలిపారు. ఈ మహాసభలకు మొదటిరోజు 28వ తేదీన ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మరియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే జంగయ్య, చావ రవి, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్,ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు డాక్టర్ కే శ్రీనివాస్, కుమారి అయిషీ గోష్ లు వివిధ అంశాలపై విద్యా సదస్సులో ప్రసంగిస్తారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కాశీనాథ్ జాదవ్ జిల్లా కార్యదర్షులు యేశప్ప, నరేష్,నర్సయ్య, హరిసింఘ్ మండలాల బాధ్యులు జ్యోతి లింగం, శ్రీ రామ్ నాయక్, హనుమన్లు,మహేష్, రవికుమార్, దేవిసింఘ్ , రవిందర్ శివకుమార్, ఆయాజ్ అలీ, శివానాయక్, రాజుడాస్, సర్దార్, పంచాక్షరి, ప్రవీణ్ కుమార్, సంజీవ్ కుమార్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment