తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి డిసెంబర్జి 01,
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నుండి మాల మహానాడు శ్రేణులు హైదరాబాద్ పెరెడ్ గ్రౌండ్ లో జరిగే మాల సింహ గర్జనకు మండలంలోని చేబర్తి గ్రామం నుండి బయలుదేరారు.వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము లో అత్యధికంగా మల సంగం ఉందని అన్నారు.మాలల మీద చేస్తున్న విషప్రచారం మానుకోవాలని,ఎన్నో ఉద్యమాలకు మాలలు నేతృత్వం వహించారని,సమాజ హితం కోరే వ్యక్తులు మలాలు అని అన్నారు.తెలంగాణ ఉద్యమం సమయములో కూడా మాల లు ముందు ఉండి ఉద్యమం చేశారని గుర్తు చేశారు.దేశాన్ని పెత్తందార్లు పరిపాలించెవారని,ఆనాటి నుండి విభజించు పాలించు అనే సూత్రాన్ని అమలు చేస్తున్నారని,నేడు అదే జరిగిందని,వర్గీకరణ పేరుతో అగ్రవర్ణాలు రాజకీయ పబ్బము గడుపుతున్నారని అన్నారు.నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లకు మాత్రమే ఈ రాజకీయ పార్టీలు అమలు చేస్తున్నవి తప్ప ఎ ఒక్క అగ్ర పార్టి నాయకులు రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేయలేదని,వారికి మాల మాదిగలు కలిసి ఉంటే వారి రాజకీయ భవిష్యత్తు శూన్యమని తెలిసి వర్గీకరణ ద్వారా మాల మాదిగలను విడకొడ్టుతున్నారని,జరుగుతున్న ఆర్థికంగా,సామాజికంగా,రాజకీయ అన్యాయాలకు ఎదిరించడానికి ఈ మాలల బహిరంగ సభ ఏర్పాటు చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు ర్యాకం యాదగిరి,షమ్మని కనకరాజు,షమ్మని భాస్కర్,రామిండ్ల అనిల్,కొండ బాలకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.