మాలల సింహ గర్జనకి అత్యధిక సంఖ్యలో మాలలు తరలిరండి……..
తెలంగాణా కెరటం :మెట్ పల్లి ప్రతినిధి, నవంబర్ 30;
డిసెంబర్ 01 తారీఖున సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్లో జరగనున్న మాలల “మహా సింహ గర్జన” సభకు తెలంగాణా రాష్ట్రంలో వున్నా మాలలు అందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చెయ్యగలని మెట్ పల్లి పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీకి చెందిన మాల సంగం నాయకులు, విద్యావంతులు, మేధావులు పిలుపునీచ్చారు…. రేపు జరగనున్న సభ విజయవంతం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలకు మాలల సత్తా నిరోపించుకోవాలి అని చెప్పారు కార్యక్రమంలో సంఘ పెద్ద మనుషులు సోమిడి నాడ్పి రాజం, దయ్య నందయ్యా, పొట్ట రాజేశ్వర్ తో పాటు దళిత నాయకులు సోమిడి రఘు, సోమిడి శివ కుమార్, గోరుమంతుల మారుతీ పాల్గొన్నారు