---Advertisement---

మాలల సింహగర్జన విజయవంతం చేయాలి

---Advertisement---

మాలల సింహగర్జన విజయవంతం చేయాలి

 

-మాల మహానాడు మద్దూరు మండల అధ్యక్షుడు బొప్పా నాగయ్య..

 

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి నవంబర్(30)

 

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నేడు హైదరాబాదులో జరిగే మాలల సింహగర్జనకు హలో మాల చలో హైదరాబాద్ బహిరంగ సభను విజయవంతం చేయాలని. మద్దూరు మాల మహానాడు మండల అధ్యక్షుడు బొప్పా నాగయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ చేస్తున్న కుట్రలను దేశ ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చుపెట్టి బిజెపి ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల ఐక్యతను డిసెంబర్ 1న చూపిస్తున్నామని ఆయన తెలిపారు .హైదరాబాదులో నిర్వహిస్తున్న మాలల సింహగర్జనకు ప్రతి ఒక్క మాల కుల బాంధవులు కుటుంబ సమేతంగా హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment