మల్లికార్జున ఉత్సవాలను ప్రారంభించిన మున్సిపల్ వైస్ చైర్మన్
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 22.
కామారెడ్డి పట్టణపరిధిలోని దేవుని పల్లి గ్రామంలో ఆదివారం ఘనంగా మల్లికార్జున స్వామి ఉత్సవాలు ప్రారంభించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఉరుదుండ వనిత రవి ఆధ్వర్యంలో దేవునిపల్లి గ్రామంలోని అన్ని దేవతలకు బోనాలు, కొబ్బరికాయలు కొట్టి నారు. ఈ కార్యక్రమంలో
మున్సిపల్ వైస్ చైర్మన్ ఉరుదొండ వనిత రవి ఆధ్వర్యంలో పలువురు మహిళలు పాల్గొని అమ్మ వార్లకు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మల్లికార్జున స్వామి ఉత్సవాలలో గ్రామంలోని ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు