నూతన సంవత్సర రోజున
పోలీసుల మముళ్ళ పంచాయితీ
1,500 వందల కోసం కొట్టుకున్న పోలీసులు
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పోలీస్ స్టేషన్ లో 1,500 వందల కోసం కానిస్టేబుల్ , హోంగార్డు ఘర్షణ పడిన సంఘటన పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్ లో జరిగింది .
ఎస్ ఐ గోపి కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.
పెన్ పహాడ్ లో ఒక టి స్టాల్ దుకాణదారుడు కానిస్టేబుల్ రవి కుమార్ కు , హోంగార్డు శ్రీను కు రూ. 15,00 వందలు నూతన సంవత్సర దావత్ కొరకు ఈనాం ఇచ్చినాడు రవి కుమార్ ఒక్కడే ఆ డబ్బులు వాడుకోవటంతో ఇద్దరి మధ్య స్టేషన్ లో గొడవ జరిగింది మాటల యుద్ధం పెరిగి పిడి గుద్దులు ఘర్షణ దాకా పోయింది . ఇదంతా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రజల ముందే జరగడం గమనార్హం . ఈ విషయం జిల్లా ఎస్ పి సన్ ప్రీత్ సింగ్ దృషికి వెళ్లడంతో కానిస్టేబుల్ రవి కుమార్ ను సస్పెండ్ చేశారు హోంగార్డు శ్రీను ను వి ఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్ ఐ గోపి కృష్ణ తెలిపారు .
ఇలాంటి సంఘటనలు జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్ లో ఎక్కడైనా పునరావృతం అయితే ఇలాగే వుంటుంది అని మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వుండాలని జిల్లా పోలీసులకు జిల్లా ఎస్ పి సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు .