పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
దుబ్బాక:జనవరి01,(తెలంగాణ కెరటం)
మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన దుబ్బాకలో చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాలు. దుబ్బాక గ్రామానికి చెందిన చింతల రామచంద్రం (70) మద్యానికి బానిసై జీవితం మీద విరక్తి పుట్టి సోమవారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందులో మద్యం కలిపి సేవించాడు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.