కల్హేరు: ఉరివేసుకొని వ్యక్తి మృతి
తెలంగాణ కెరటం: నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రతినిధి జనవరి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఉరివేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన కల్హేరు మండలంలో జరిగింది. ఎస్ఐ వెంకటేశ్ తెలిపిన వివరాలు.. మండలంలోని బీబీ పేట గ్రామానికి చెందిన కురుమ గంగారం కుటుంబ కలహాలతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇవాళ ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుడి భార్య సాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేస్తామని తెలిపారు.