విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా ‘మండలోజి పవన్’
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 16 : కోరుట్ల పట్టణంలోని శ్రీనివాస రోడ్ విశ్వ బ్రాహ్మణ సంఘం 2024-25 సంవత్సర కార్యవర్గ ఎన్నికలు సోమవారం సంఘ భవనంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా మండలోజు పవన్. ప్రధాన కార్యదర్శిగా వనతడపుల సంజీవ్, కోశాధికారిగా గాండ్లోజి శ్రీధర్ లు ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన వారికి విశ్వబ్రాహ్మణ సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఎన్నికల అధికారులుగా స్ధానిక కౌన్సిలర్ గుండోజీ శ్రీనివాస్, వనతడుపుల ఈశ్వర్, వనతడుపుల పవన్, గుండోజీ రవిలు వ్యవహరించారు.