శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు దీవెనలు దుబ్బాక నియోజకవర్గ ప్రజల పైన ఎల్లప్పుడూ ఉండాలి
–దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్
దుబ్బాక:జనవరి11,(తెలంగాణ కెరటం)
దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ప్రజలకు ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,స్వామి వారిని దుబ్బాక నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ స్వామివారు ప్రసాదించాలని, ఆ వెంకటేశ్వర స్వామిని కోరడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.అలాగే ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు దీవెనలు దుబ్బాక నియోజకవర్గ ప్రజల పైన ఎల్లప్పుడూ ఉండాలని ఆ స్వామివారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు శాలువా కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి, కౌన్సిలర్లు, మాజీ జెడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి మాజీ ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు వడ్లకొండ శ్రీధర్, చింతరాజు, కూర వేణు, నల్ల శ్రీనివాస్,చింత భాస్కర్ పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు.