గుంతలను పూడ్చిన మాజీ కౌన్సిలర్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం డి లయిక్ అహ్మద్
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 28):
జగదేవపూర్ రోడ్డు లో ప్రమాదకరంగా ఉన్న గుంతలను మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం డి లయిక్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో మునిసిపల్ సహకారంతో పూడ్చడం జరిగింది. తదుపరి మాట్లాడుతూ భువనగిరి నుండి గజ్వేల్ వెళ్లే రహదారిపై నిత్యం వందల కొద్ది భారీ వాహనాలు రాకపోకలు జరుతాయి ఇట్టి రోడ్డు పై గుంతలు పడటటం వల్ల నిత్యం ఏదో ఒక వాహనం పడుతుంది అని తెలిపారు .ఈ కార్యక్రమంలో నాయకులు అబేద్ అలీ, అజీమ్ ఖాన్, అహ్మద్ బబ్బు, అబ్దుల్ జబ్బార్, సల్మాన్ ఖాన్, మునిసిపల్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.