మెదక్ ఎమ్మెల్యే డాక్టర్. మైనంపల్లి రోహిత్ రావు తనకంటూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్
రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నాయకుడు,మెదక్ ఎమ్మెల్యే డాక్టర్. మైనంపల్లి రోహిత్ రావు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్ట సుఖాలను పాలుపంచుకుంటున్న ఆయన మరోసారి తనలోని ప్రజాసేవ గుణాన్ని ప్రదర్శించారు. ప్రజాసేవ చేయాలని సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన మైనంపల్లి రోహిత్… ప్రతినిత్యం తన నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం తపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను గుండెల్లో పెట్టుకొని అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజల కోసం అనునిత్యం పాటు పడుతూనే ఉన్నారు. మెదక్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి కష్టాన్ని తన కష్టంగా భావిస్తూ తనకు చేతనైన సాయాన్ని అందిస్తూ మైనంపల్లి రోహిత్ ముందుకు సాగుతున్నారు. మెదక్ లోని చిన్న పెద్ద, బీజా బిక్కి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి కష్టంలో భాగమవుతున్నారు. తనను అసెంబ్లీకి పంపించిన మెదక్ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా అసెంబ్లీలో మైనంపల్లి రోహిత్ గళమెతుతున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకున్న వ్యవస్థ అని అన్నారు అబ్రహం లింకన్. ఆయనతోపాటు రాహుల్ గాంధీ, రేవంత్ అన్న గారి స్ఫూర్తితో ప్రజాస్వామ్య వ్యవస్థను మెదక్ నియోజకవర్గంలో స్థాపించడమే తన కర్తవ్యంగా ముందుకు సాగుతున్నారు మైనంపల్లి రోహిత్. అందులో భాగంగానే ప్రజాదర్బార్ అనే వినూత్న కార్యక్రమంతో ప్రజల ముందుకు త్వరలోనే రాబోతున్నారు. ఈ గ్రామదర్బా ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించబోతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పి, అడిషనల్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లతో పాటు అన్ని శాఖలకు చెందిన ముఖ్య అధికారులు మొదలుకొని ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులు, మెడికల్ ఆఫీసర్ల వరకు ప్రతి ఒక్క అధికారిని ప్రజల ముందుకుతీసుకురాబోతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపబోతున్నారు. ఈ ప్రయత్నానికి అధికార యంత్రాంగం తో పాటు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు ముఖ్యంగా తన అభిమానులు అండగా నిలుస్తారని ఆశిస్తున్నారు.