శ్రీ సరస్వతీ శిశు మందిర్ నూతన భవన నిర్మాణానికి మెదక్ ఎంపీ ఆర్థిక చేయూత
ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సుమారు 25 లక్షల రూపాయల విలువ చేసే స్టీలు డొనేట్
తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా ప్రతినిధి జనవరి
ఈ సందర్భంగా సరస్వతీ విద్యాపీఠం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తడకమడ్ల ఈశ్వరయ్య మాట్లాడుతూ గుడిసేవ కన్నా బడి సేవ మిన్న. గుడి గురించి చెప్పాలంటే ముందు బడి ఉండాలి కాబట్టి దాతలు ముందుకు వచ్చి ఈ బడి నిర్మాణం కొరకు సహకరించగలరని విజ్ఞప్తి చేశారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలువైనటువంటి శ్రీ సరస్వతీ శిశు మందిర్ లాంటి పాఠశాలలను మనం కాపాడుకుంటేనే భవిష్యత్తులో సంస్కృతి సంప్రదాయాలు నిలబడతాయని దాతలు సహృదయంతో ముందుకు వచ్చి ఇట్టి భవన నిర్మాణానికి సహకరించగలరని కోరారు. రెండున్నర ఎకరాల్లో సుమారు 6.5 కోట్ల బడ్జెట్ తో నిర్మించ తలపెట్టినటువంటి ఈ భవన నిర్మాణం ప్రస్తుతం పిల్లర్ల వరకు నిర్మాణం పూర్తయిందని స్లాబు వర్కు ప్రారంభమైంది. సిద్దిపేటలో గల విద్యావేత్తలు విద్యాభిలాషులు ఒకసారి పాఠశాలను సందర్శించి దీన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఆవాస విద్యాలయం అధ్యక్షులు కొమరవెల్లి శేఖర్ &సరస్వతీ శిశు మందిర్ ప్రధాన ఆచార్య మోతుకు నరేష్ కుమార్ పాల్గొన్నారు.