విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న అచ్చంపేట పద్మశాలి మహిళ సంఘం సభ్యులు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 29):
కార్తీక మాసం చివరి శుక్రవారం సందర్భంగా పద్మశాలి మహిళ సంఘం ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన పద్మశాలి మహిళా సంఘం మహిళలు దాదాపు 30 మంది విజయవాడ కనకదుర్గ దేవిని దర్శించుకున్నారు. మహిళ సంఘం అధ్యక్షురాలు దాసుపత్రి శకుంతల ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనం చేసుకొని కృష్ణా నదిలో కార్తీక దీపాలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మహిళ సంఘం ఆధ్వర్యంలో విహారయాత్రకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి మహిళ సంఘం అధ్యక్షురాలు దాసుపత్రి శకుంతల, గంజి నిర్మల, కోట ప్రశాంతి, ఇమ్మడి రాజేశ్వరి, దాసు జంగమ్మ, కుకుడాల నారాయణమ్మ, క్యామ తిరుపతమ్మ, మాకం పద్మ, వనం శ్రీదేవి, క్యామ పద్మ, కర్నాటి బాలమణిలు పాల్గొన్నారు.