‘ఏఆర్ బ్యాటరీస్’ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు రఫీ
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, జనవరి 11 : కోరుట్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఆర్ బ్యాటరీస్ షాపు ప్రారంభోత్సవంలో శుక్రవారం కోరుట్ల మజ్లిస్ అధ్యక్షుడు ముహమ్మద్ రఫీ పాల్గొన్నారు. దుకాణదారులు హసీబుద్దీన్, షరీఫుద్దీన్ లకు జగిత్యాల మజ్లిస్ కౌన్సిలర్ మహమ్మద్ రజీయుద్దీన్, కోరుట్ల మజ్లిస్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మజ్లిస్ సెక్రటరీ అబ్దుల్ వాజిద్, జాయింట్ సెక్రటరీ అబ్దుల్ రహీం, సల్మాన్, సమీర్, నిజాం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ హాజరైన హసీబుద్దీన్, షరీఫుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.