---Advertisement---

ఈ నెల 22న యాదగిరిగుట్టకు మంత్రుల రాక @

---Advertisement---

@ ఈ నెల 22న యాదగిరిగుట్టకు మంత్రుల రాక @

 

*గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో గాంధీ విజ్ఞాన సదస్సు*

 

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి

 

గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో గాంధీ విజ్ఞాన సదస్సు-2024 పేరుతో యాదగిరిగుట్టలో 22న రైతు సదస్సు నిర్వహించనున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ బిర్ల ఐలయ్య అన్నారు.కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని వారన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రైతు సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు..రైతు సదస్సు కన్వీనర్ పడమటిపావని మాట్లాడుతూ గుట్టలో జరిగే రైతు విజ్ఞాన సదస్సు ను విజయవంతం చేయాలని కోరారు..సదస్సులో రైతు ఉత్పత్తుల ప్రదర్శన, మట్టి పాత్రల, చేనేత వస్త్రాల ప్రదర్శన నిర్వహించనున్నావని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మెరుగు మధు, యాదాద్రి భువనగిరి జిల్లా జి జి ఎఫ్ అధ్యక్షులు మాటూరు అశోక్, మాజీ ఎంపీపీ శ్రీశైలం, ఎరుకల హేమేంద్ర గౌడ్, భరత్ గౌడ్, కాదూరి అచ్చయ్య, కాడే మహేందర్,సదస్సు కో కన్వీనర్ మిర్యాల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు….

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment