---Advertisement---

కోరుట్లలో ఘనంగా ఎమ్మెల్యే గడ్డం వివేక్ జన్మదిన వేడుకలు

---Advertisement---

కోరుట్లలో ఘనంగా ఎమ్మెల్యే గడ్డం వివేక్ జన్మదిన వేడుకలు

 

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 30 : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ సంఘ రాష్ట్ర నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ బలిజ రాజారెడ్డి ఆధ్వర్యంలో శనివారం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గడ్డం వివేక్ దళితుల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలను చేశారని, మాలల ఐక్యత కోసం, హక్కుల కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన చేసిన సేవలను మరువలేమని అన్నారు. నేడు హైదరాబాదులో జరగనున్న హలోమాల..చలో హైదరాబాద్… మాలల సింహగర్జన కార్యక్రమానికి మాలలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ వేడుకల్లో రాష్ట్ర నాయకులు ఉయ్యాల నరసయ్య, బద్ది మురళి, డివిజన్ అధ్యక్షుడు ఉయ్యాల శోభన్, నాయకులు పసుల కృష్ణ ప్రసాద్, వెంకటస్వామి, భూపెళ్లి నగేష్, గోరువంతులు నారాయణ, సిరికొండ రాములు, రాస మల్ల రాజనర్సయ్య, సామల వేణుగోపాల్, బలిజ సంతోష్ కుమార్, బోలుమల్ల నరేష్, నవీన్, గంగ నరసయ్య, కోట శంకర్, భూపెళ్లి సంజీవ్, సురేష్, రాజేందర్, విజయేందర్ లతోపాటు కోరుట్ల మండల వివిధ గ్రామాల అంబేద్కర్ మాల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment