---Advertisement---

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే కవ్వంపల్లికి లేదు*  –బీఆర్ఎస్ నాయకులు బోనగిరి ప్రభాకర్ 

---Advertisement---

*ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే కవ్వంపల్లికి లేదు*

–బీఆర్ఎస్ నాయకులు బోనగిరి ప్రభాకర్

 

తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి నవంబర్ 30 :

 

మానకొండూర్ అసెంబ్లీ ఎస్సీ రిజర్వుడు కాకపోతే కవ్వంపల్లి సత్యనారాయణ ఎవరో ఇక్కడ ఎవరికి తెలిసేది కాదని, ఆయన తన జీవితంలో ఒక్కరినైనా హాస్టల్ లలో చదివించిన దాఖలాలు లేవని, నైతిక బాధ్యతలు ఉన్న ఎమ్మెల్యే నోటికి ఏది వస్తే అది మాట్లాడి, మీ స్థాయిని మరిచిపోతున్నారని బీఆర్ఎస్ నాయకులు బోనగిరి ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఆర్ఎస్పీ పై అవాకులు, చేవాకులు పేలుతూ అధిష్టానం వద్ద మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తున్న మీరు గాంధీభవన్ లోనే ఉంటే బాగుంటుందని, గురుకులాలను ఒక చరిత్రగా చెప్పుకునేలా కేసీఆర్ సహాకారంతో ఎన్నో సంస్కరణలు చేసాడని అన్నారు. ఆర్ఎస్పీని విమర్శిస్తే సూర్యుడు పై ఉమ్మేసినట్లేనని, శంకరపట్నంలోని ఆర్కండ్ల బ్రిడ్జి నిర్మాణం, బెజ్జంకి నుండి ఇల్లంతకుంట వరకు రోడ్డు బాగాలేదని, నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనుల పై దృష్టి పెట్టాలని, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇప్పటిదాకా దళితులకు ద్రోహం చేసిన పార్టీ అని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. గురుకుల పాఠశాలల్లో 11 నెలల మీ ప్రభుత్వ హయాంలో 40 మంది విద్యార్థులు చనిపోయారని, ఫుడ్ పాయిజన్ వల్ల జరుగుతోందని, మీరు దానిపై విచారణ చేయాలి కానీ గురుకులాల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై నిందారోపణలు చేయడం తగదన్నారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా ప్రతికార పాలన, రాక్షస పాలన అని, మీ పద్దతి మార్చుకోకపోతే రాబోయే స్థానిక ఎన్నికలలో ప్రజలే తగిన బుద్ది చెప్తారని అన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment