అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి జనవరి

బెజ్జంకి మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం రోజున మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించడం జరిగింది. మండలంలోని పోతారం గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి, చీలాపూర్ పల్లె లో సీసీ రోడ్డు నిర్మాణం కు భూమి పూజ, ప్రాథమిక పాఠశాలలో కిచెన్ షెడ్ ప్రారంభోత్సవం, చీలాపూర్, గుండారం లో సీసీ రోడ్డుకు నిర్మాణం కు, బెజ్జంకి మండల కేంద్రంలో అంగన్వాడీ భవన నిర్మాణం కు భూమి పూజ నిర్వహించారు. అనంతరం బెజ్జంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులు 31 మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అలాగే బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మండల పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, డిపిఎం కరుణాకర్, ఏపీఎం నరసయ్య ఎంపీఓ అంజయ్య, లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో విశ్వనాధ్ శర్మ, ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, చైర్మన్ జెల్ల ప్రభాకర్, డైరెక్టర్లు బర్ల రాజయ్య, బెజగం విశ్వప్రసాద్ గుబిరె చంద్రయ్య, దోనే శ్యామ్, ఐలేని జయ, బోనగిరి ప్రభాకర్, ప్రధాన అర్చకులు శేషం మధుసూదనాచారి, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, అక్కరవేణి పోచయ్య వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment