---Advertisement---

నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి కోమటిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి* 

---Advertisement---

*నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి కోమటిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి*

 

తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి డిసెంబర్ 10 :

 

మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల విడుదలకు సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం రోజున, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో గతంలో మంజూరైన పెండింగ్ పనులు, నూతన అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల మంజూరు కోసం సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ, మానకొండూర్ నియోజకవర్గంలో గతంలో మంజూరైన పనులు చాలావరకు అసంపూర్తిగా మిగిలిపోయాయని, వాటిని వెంటనే పూర్తి చేయించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వర్షాకాలంలో కాజ్ వే లపై వరద నీరు ప్రవహించడం వల్ల గ్రామాలు, మండలాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. అందుకే హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం అనివార్యమైందని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ మొదటి దశలో 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తానని, పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అలాగే, ప్రజలకు ప్రయోజనం కలిగించేలా అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంతో నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment